: రైతు రుణాలపై జగన్ లేఖ అపరిపక్వతకు నిదర్శనం: టీడీపీ
తన ప్రమాణ స్వీకారం అనంతరం రైతు రుణాల మాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేసిన సంగతి తెలిసిందే. దానిపై ఆ వెంటనే బాబుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ లేఖ రాయడాన్ని టీడీపీ తిప్పికొట్టింది. అసలు రైతు రుణాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? అంటూ ప్రశ్నించడం జగన్ అపరిపక్వతకు నిదర్శనమని టీడీపీ నేత వై.రాజేంద్రప్రసాద్ విమర్శించారు. బాబు సంతకంతో ప్రజలు ఆనందంగా ఉంటే జగన్ ఓర్వలేకపోతున్నారన్నారు. ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా జగన్ మాట్లాడుతున్నారన్నారు. ఈ మేరకు హైదరాబాదులోని ఎార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీని టీడీపీ నెరవేరుస్తుందని ఆయన చెప్పారు.