: రైతులు రుణాలు చెల్లించవద్దు: మోత్కుపల్లి


రాష్ట్రంలో రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. రైతులు చేసిన రుణాల్ని మాఫీ చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడం సరికాదని ఆయన విమర్శించారు.

మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తుందని నర్సింహులు హామీ ఇచ్చారు. అప్పటివరకు రైతులు రుణాలు చెల్లించవద్దని మోత్కుపల్లి అన్నదాతలకు సూచించారు.

  • Loading...

More Telugu News