: ముండే మృతిపై సీబీఐ దర్యాప్తుకు కేంద్ర హోంశాఖ సిఫారసు
బీజేపీ నేత గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయించాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ నేత ఈ ఉదయం హోంమంత్రి రాజ్ నాథ్ ను కలసి డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 3న ఢిల్లీలో ముండే కారు ప్రమాదానికి గురైంది. అనంతరం ఆయనను ఆసుపత్రిలో చేర్పించగా మరణించిన సంగతి విదితమే!