: కాంగ్రెస్ ఎంపీలను పాండవులతో పోల్చిన మల్లికార్జున ఖర్గే!


బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పాండవులతో పోల్చుకున్నారు లోక్ సభలో ఆ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే. ఇందుకు పురాణ గాథ మహాభారతాన్ని ఉదాహరణగా తీసుకుని తన విశ్లేషణ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో మాట్లాడుతున్న ఖర్గే, ముగింపు సమయంలో... 'లోక్ సభలో మేము (కాంగ్రెస్) 44 మంది ఎంపీలు ఉండవచ్చు. కానీ, పాండవులెప్పుడూ వందమంది కౌరవుల ముందు భయపడలేదు' అంటూ వ్యాఖ్యానించారు.

అంతకుముందు సభలో తొలుత మాట్లాడిన రాజీవ్ ప్రతాప్ రూఢీ, 2014 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఎకు ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేదన్నారు. దాంతో, తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఎవరిని ఎలా సంప్రదించాలో తెలియడంలేదని వ్యాఖ్యానించారు. కానీ, బాధపడాల్సిన అవసరంలేదని... తాము ప్రతి ఒక్కరిని సంప్రదిస్తామని, ఎందుకంటే తమ ప్రధాని (మోడీ) విశాల హృదయం కలవారని పేర్కొన్నారు. ఈ మాటలపైనే ఖర్గే పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News