: బ్యాంకాక్ లో హీరోయిన్ బ్యాగ్ కొట్టేశారు


ప్రముఖ పర్యాటక నగరం బ్యాంకాక్ లో దొంగలు విదేశీయులకు తమ తడాఖా చూపిస్తున్నారు. ఇందులో భాగంగా తమ దేశానికి వచ్చిన భారత నటి రకుల్ ప్రీత్ సింగ్ బ్యాగును తన్నుకుపోయారు. అందులో ఫోన్, ఐడీకార్డు, ఇతర వస్తువులు ఉన్నాయట. స్నేహితులతో కలసి బ్యాంకాక్ కు వెళ్లినప్పుడు ఇద్దరు దొంగలు బైకుపై వచ్చి చేతిలో ఉన్న బ్యాగ్ ను లాక్కుని పోయారని ఆమె వెల్లడించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, జాగ్రత్తగా ఉండాలని వారు సూచించినట్లు తెలిపింది. రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News