: దర్యాప్తు సంస్థలతో యూపీఏ బెదిరింపులు: వెంకయ్యనాయుడు
తనకు ఎదురుతిరిగిన వారిపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తుందంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏపై వస్తోన్న విమర్శలు మరింత పెరిగాయి. రాజమండ్రిలో ఈ రోజు మాట్లాడిన బీజేపీ నేత వెంకయ్యనాయుడు.. యూపీఏపై ఎప్పటిలాగే తన విమర్శల పరంపరను ఎక్కుపెట్టారు.
ఏ క్షణమైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలను చేతుల్లో పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. మద్దతు ఉపసంహరించుకుంటామంటున్న మిత్రపక్షాలపైనా సీబీఐ, ఐటి, ఈడి, డీఆర్ వంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు.