: హైదరాబాదులో పవర్ కట్ తో ప్రజల పరేషాన్


గ్రేటర్ హైదరాబాదు పరిధిలో సోమవారం నుంచి అప్రకటిత విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. దీంతో ఎండలతో పాటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఎండలు పెరగడంతో ఈ వేసవిలో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని, దీంతో విద్యుత్ కోతలు విధించక తప్పడం లేదని విద్యుత్ శాఖాధికారులు అంటున్నారు. కానీ, ముందస్తు సమాచారం లేకుండా గంటగంటకూ పవర్ కట్ విధించడంపై జంటనగర వాసులు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News