: ఫైన్ కట్టకపోతే ప్రైవేట్ స్కూళ్ల ఆస్తులు జప్తు చేసేయండి
హైదరాబాదు నగరంలోని ప్రైవేట్ స్కూళ్ల పనితీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విద్యాలయాలపై ఇదివరకు ప్రభుత్వం జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. జరిమానా చెల్లించని ఆయా స్కూళ్ల ఆస్తులను జప్తు చేయాలని సర్వశిక్షా అభియాన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మీడియాలో ఈ విషయంపై పలు కథనాలు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.