: ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించడంపై కసరత్తు మొదలు పెట్టారు. ఒకటి రెండు రోజుల్లో కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విస్తరణపై పార్టీ ముఖ్యనేతలతో ఈ రోజు సాయంత్రం ఆయన సమావేశం కానున్నారు. అందుబాటులో ఉండాలని 10 మంది ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మంత్రివర్గంలో స్థానం కోసం చాలా మంది పోటీపడుతున్న సంగతి తెలిసిందే.