: సైన్యాధ్యక్షుడి విషయంలో సొంత మంత్రితో విభేదించిన కేంద్రం


తదుపరి సైన్యాధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ ను యూపీఏ సర్కారు నియమించడాన్ని మోడీ సర్కారు కూడా సమర్థించింది. ఎన్నికల ముందు యూపీఏ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీ తప్పు బట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుహాగ్ ను సైన్యాధ్యక్షుడిగా నియమించడాన్ని సవాల్ చేస్తూ మణిపూర్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.

ప్రస్తుత రక్షణ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ లోగడ సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు సుహాగ్ పై క్రమశిక్షణ, నిఘాపరమైన నిషేధం విధించారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. 2010లో దిమాపూర్ లో ఆర్మీ నిఘా విభాగం ముగ్గురు యువకులను అన్యాయంగా చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ యూనిట్ కు సుహాగే నాయకత్వం వహించారు. అయితే, ఈ పిటిషన్ పై కేంద్రం తన స్పందనను అఫిడవిట్ రూపంలో తెలియజేసింది. సుహాగ్ పై నాడు వీకే సింగ్ నిషేధం విధించడానికి ఎలాంటి ఆధారాలు లేవని అందులో స్పష్టం చేసింది. ప్రస్తుత సైన్యాధ్యక్షుడు బిక్రంసింగ్ జులైలో పదవీ విరమణ చేయనున్నారు.

  • Loading...

More Telugu News