: తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ కు కేసీఆర్ శుభాకాంక్షలు
తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మధుసూదనాచారికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తెలంగాణ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో మధుసూదనాచారి తన వెంటే ఉన్నారన్న కేసీఆర్, ఆయన సేవలు మరువలేనివని ప్రశంసించారు.