: విశాఖలో చంద్రబాబు కేబినెట్ తొలి సమావేశం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశానికి విశాఖపట్నం వేదిక కానుంది. ఈ నెల 12న ఇక్కడ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. నగరంలో సమావేశం నిర్వహించే స్థలాన్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అయితే, ఆంధ్రా యూనివర్సిటీలో గానీ, జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గానీ నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రైతుల రుణాల మాఫీ, కొత్త రాజధాని తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశానికి 19 మంది మంత్రులు హాజరుకానున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News