: దేవాశిష్ బోస్ మృతదేహం లభ్యం: మంత్రి నారాయణ
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో ఈ ఉదయం లభ్యమైన మృతదేహం దేవాశిష్ బోస్ దని గుర్తించినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించడానికి ప్రమాద స్థలికి నారాయణ వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలసి నారాయణ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కూడా అక్కడికి చేరుకున్నారు. కాగా, మండిలో పోస్ట్ మార్టం అనంతరం దేవాశిష్ బోస్ మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించనున్నారు.