: హిమాచల్ ప్రదేశ్ ప్రమాదం తర్వాత వెంటనే స్పందించాం: చంద్రబాబు


హిమాచల్ ప్రమాదం తర్వాత వెంటనే స్పందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బియాస్ నదిలో హైదరాబాదు విద్యార్థులు గల్లంతైన ఘటనపై మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ఉన్న తమ పార్టీ నేతలను అప్రమత్తం చేశామని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కోరామన్నారు. 24 మంది విద్యార్థులు చనిపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల మృత దేహాలను వెతకాల్సిన అవసరముందని ఆయన అన్నారు. సహాయక చర్యలు సరిగా లేవని తెలుస్తోందని, హిమాచల్ ప్రదేశ్ సీఎం, హోంమంత్రితో మాట్లాడుతానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సమన్వయం చేసుకుంటామన్నారు. బాధితులను ఆదుకోవడంలో కలిసి పనిచేస్తామన్నారు.

  • Loading...

More Telugu News