: నకిలీ ఎన్ కౌంటర్ కేసులో అమిత్ షాకు ఊరట


నకిలీ ఎన్ కౌంటర్ కేసులో నరేంద్ర మోడీ అనుచరుడు, గుజరాత్ మాజీ హోంమంత్రి అమిత్ షాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆ రాష్ట్ర పోలీసు తులసీరామ్ ప్రజాపతి నకిలీ ఎన్ కౌంటర్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న షాపై ప్రత్యేక విచారణ అవసరం లేదని కోర్టు చెప్పింది. షోహ్రబుద్దీన్ కేసుతో పాటే తులసీరామ్ కేసును కూడా దర్యాప్తు చేయాలని ఆదేశించింది.

తులసీరామ్ నకిలీ ఎన్ కౌంటర్ కూడా షోహ్రబుద్దీన్ కేసులో భాగమేనని తెలిపింది. దీనిపై సీబీఐ ప్రత్యేక ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీటు దాఖలు చేయాల్సిన అవసరంలేదని చెప్పింది. అనంతరం సీబీఐ షాపై సుప్రీంలో వేసిన పిటిషన్ ను తోసి పుచ్చింది. ఎన్ కౌంటర్ వ్యవహారంలో సంబంధం ఉందని తీవ్ర విమర్శలు, ఆరోపణలు రావడంతో 2010లో అమిత్ షా తన పదవికి రాజీనామా చేశారు. మూడు నెలలు జైల్లో ఉండి అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు.

  • Loading...

More Telugu News