: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు


హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాక ముందే రికార్డు నెలకొల్పింది. 2013 'గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు'గా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. న్యూయార్క్ లో కొన్నిరోజుల కిందట జరిగిన సదస్సులో గ్లోబల్ 'ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లీడర్ షిప్ ఫోరమ్' సుమారు వంద ప్రాజెక్టులను పరిశీలించిన అనంతరం, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఉత్తమమైనదిగా ఎంపిక చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మెట్రో రైలు ప్రాజెక్టు ఈ గుర్తింపుతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటోంది.

  • Loading...

More Telugu News