: విద్యార్థులందర్నీ ఒకే విమానంలో హైదరాబాద్ తరలించాలని నిర్ణయం
విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు అందర్నీ ఒకే విమానంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి హైదరాబాదుకు తరలించాలని నిర్ణయించారు. ముందుగా హిమాచల్ ప్రదేశ్ లోని మండి వద్ద ఉన్న 24 మంది విద్యార్థులను, ఓ అధ్యాపకుడిని కులూమనాలికి తరలిస్తున్నారు. రెండు చిన్న విమానాల్లో వారిని కులూమనాలి నుంచి చండీగఢ్ తరలిస్తారు. అక్కడి నుంచి అందర్నీ ఒకే విమానంలో హైదరాబాదుకు తీసుకువస్తారు.