: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 12 మంది మృతి
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడ మండల పరిధిలోని ఆరేపల్లి సమీపంలో ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. వరంగల్ నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తున్న రెండు కుటుంబాలకు చెందిన వారు ప్రమాదానికి గురయ్యారు. మృతులు వరంగల్ జిల్లా కాశీబుగ్గ వాసులు.