: షరతులు లేని రుణమాఫీ చేయకపోతే సభలో నిలదీస్తాం: ఎర్రబెల్లి
ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయకపోతే అసెంబ్లీలో నిలదీస్తామని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎన్నికకు తాము మద్దతిస్తామని చెప్పారు. సభలో అమరవీరులకు సంతాపం తెలుపుతూ తొలి తీర్మానం చేయాలని సూచించారు. అంతేకాకుండా, అమరవీరుల కుటుంబాలను ఎలా ఆదుకుంటారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.