: ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా
కృష్ణాజిల్లా పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో ఆరా తీశారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాబు కేబినెట్లో మంత్రి పదవి రాలేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఆయనను ఈ రోజు విజయవాడ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, వెంకట్రావుకు గుండెపోటు వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. షుగర్ లెవల్స్ పడిపోయాయని, హైబీపీ ఉందని... 12 గంటలు దాటితే గానీ ఆయన పరిస్థితి చెప్పలేమన్నారు.