: నేడు మోడీతో గుజరాత్ సీఎం సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఈ రోజు గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ సమావేశం కానున్నారు. కాగా, ఈ సాయంత్రం ఆమె ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని కూడా కలవనున్నారు. నర్మదా ఆనకట్ట సహా గుజరాత్ కు సంబంధించిన పలు విషయాలపై ప్రధానితో ఆమె చర్చించనున్నారు. మోడీకి అత్యంత విధేయురాలైన బెన్ గత నెలలో గుజరాత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.