: ప్రధాని కాకముందు రాజీవ్ గాంధీ ఏజెంట్ గా పనిచేశారా?


ప్రధాన మంత్రి కాకముందు రాజీవ్ గాంధీ దళారీగా పనిచేశారా? తాజాగా వికీలీక్స్ బయటపెట్టిన పత్రాల ఆధారంగా రాజీవ్ దళారిగా పనిచేసినట్లు హిందూ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. 1970లో స్వీడన్ కు చెందిన సాబ్ స్కానియా అనే కంపెనీ విగ్గెన్ యుద్ధ విమానాలను భారత్ కు సరఫరా చేసే విషయంలో రాజీవ్ గాంధీ ఆ కంపెనీ తరఫున కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్టు దీనిలో వెల్లడించారు.

సబ్ స్కానియా కంపెనీ తరఫున మద్యవర్తి పాత్ర పోషించారని కథనంలో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ పలుకుబడితో యుద్ధ విమానాల సరఫరా డీల్ ను సొంతం చేసుకోవాలని సబ్ స్కానియా ప్రయత్నించిందని, అయినా అప్పుడా కాంట్రాక్ట్ సబ్ స్కానియాకు కాకుండా, బ్రిటన్ కు చెందిన సెపేక్యాట్ జాగ్వర్ కు వెళ్లిందని తెలిపింది.

  • Loading...

More Telugu News