: త్వరలో దయానిధి మారన్ ను ప్రశ్నించనున్న సీబీఐ
చట్టవిరుద్ధ టెలిఫోన్ ఎక్సేంజ్ కేసులో మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్, సన్ నెట్ వర్క్ ఎండీ కళానిధి మారన్ లను త్వరలో సీబీఐ ప్రశ్నించనుంది. గతేడాది అక్టోబర్ లో నమోదైన ఈ కేసులో దయానిధి పేరును సీబీఐ పేర్కొంది. 2007లో తను టెలికం మంత్రిగా ఉన్న సమయంలో బీఎస్ఎన్ఎల్ కేబుల్స్ కు సంబంధించిన 323 హై స్పీడ్ కేబుల్స్ ను అక్రమంగా చెన్నై లోని తన బోట్ క్లబ్ నివాసంకు మార్చి ఉపయోగించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.