: బెల్టు షాపుల రద్దుపై ఏపీ ప్రభుత్వం జీవో విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెల్టు షాపుల రద్దు తొలి జీవోను ఈ రోజు విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బెల్టు షాపుల్లో దొరికిన మద్యం ఏ షాపుది అయితే, దాని అనుమతులు రద్దు చేయనున్నారు. కాగా, బెల్టు షాపులపై తమకు సమాచారం ఇచ్చిన వారికి బహుమతులు అందజేస్తామని ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్పీ సింగ్ ప్రకటించారు.