: నకిలీ ఎన్ కౌంటర్ కేసులో 17 మంది పోలీసులకు జీవిత ఖైదు


నకిలీ ఎన్ కౌంటర్ కేసులో 17 మంది ఉత్తరాఖండ్ పోలీసులను ఢిల్లీలోని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. 2009లో 22ఏళ్ల ఎంబీఏ విద్యార్థి రణబీర్ సింగ్ ను నకిలీ ఎన్ కౌంటర్ లో హత్య చేసిన 17 మంది పోలీసులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే, 20వేల జరిమానా కూడా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మొత్తం 18 మందిని నిందితులుగా పేర్కొనగా... 17 మంది హత్య చేసినట్లు, మరొక నిందితుడు సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు కోర్టు తేల్చింది. 2009 జూలై 3న డెహ్రాడూన్ పోలీసులు దోపిడీదారుడిగా పేర్కొంటూ రణబీర్ ను కాల్చి చంపారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టగా... కేసు విచారణను డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ కోర్టుకు మార్చారు.

  • Loading...

More Telugu News