: మంత్రి పదవులు రాలేదని టీడీపీలో అసంతృప్తి జ్వాలలు!
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటైన టీడీపీ ఆధ్వర్యంలోని మంత్రివర్గంలో పదవులు రాలేదని పలువురు పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మనస్తాపం చెందగా... విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి తాను ఎందుకు అనర్హుడిని? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.