: బ్రిటన్ లో గాంధీ విగ్రహం ధ్వంసం
తెల్లదొరలపై చివరి క్షణం వరకూ పోరాడి, భారత్ లో వారి పీచమణిచిన జాతి పిత మహాత్మాగాంధీకి... బ్రిటన్ లో అగౌరవం జరిగింది. లీచెస్టర్ నగరంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. 1984లో పంజాబ్ లోని స్వర్ణదేవాలయంపై సైనిక చర్య ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బ్రిటన్ లోని సిక్కులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే గాంధీ విగ్రహం ధ్వంసమైనట్లు భావిస్తున్నారు. దీనిపై లీచెస్టర్ ఈస్ట్ ఎంపీ కీత్ వాజ్ మాట్లాడుతూ... గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం మూర్ఖత్వంగా పేర్కొన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.