: పురుషుల రక్షణకు ఓ హెల్ప్ లైన్
సమస్యల్లో ఉన్న మహిళలను ఆదుకునేందుకు సహాయ కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. మరి పురుషుల సంగతి ఏమిటి? అందుకే వారికీ ఓ హెల్ప్ లైన్ ప్రారంభమైంది. వేధింపులు ఎదుర్కొంటున్న మగవారికి సాయం అందించేందుకు 50 స్వచ్చంద సంస్థలతో కూడిన సేవ్ ఇండియన్ ఫ్యామిలీ అనే సంస్థ ఒక హెల్ప్ లైన్ ప్రారంభించింది. కుటుంబ, న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొనే వారికి ఈ కేంద్రం సాయమందిస్తుంది. 'మహిళలకు ఏమైనా జరిగితే వారికి సాయం లభిస్తుంది. అదే మగవారికి ఎందుకు ఉండకూడదు. దేశంలోని 62కోట్ల మంది పురుషులకు రక్షణ ఉండాల్సిందే' అని ఈ సంస్థ అధ్యక్షుడు అమిత్ గుప్తా అన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, కోల్ కతా, ముంబైలో ఐవీఆర్ సర్వీసును ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు.