: కరాచీ విమానాశ్రయంపై ఉగ్రదాడి


పాకిస్థాన్ లోని కరాచీలో గల జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. నిన్న రాత్రి 11.30 గంటలకు భధ్రతా సిబ్బంది దుస్తుల్లో వచ్చిన 10 మంది ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదులపై ప్రతి దాడికి దిగాయి. ఈ దాడిలో మొత్తం 10 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. ఉగ్రవాదులు సహా ఈ ఆపరేషన్ లో మొత్తం 23 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. అయితే, ఇంకా ముగ్గురు ఉగ్రవాదులు విమానాశ్రయంలోనే నక్కి ఉన్నట్లు, కాల్పులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News