: బియాస్ నది నుంచి ఐదుగురు విద్యార్థుల మృత దేహాలు వెలికితీత
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన వి.ఎన్.ఆర్. విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థుల్లో ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థుల మృత దేహాలను అక్కడి గజ ఈతగాళ్లు వెలికితీశారు. వారిలో విజేత, ఐశ్వర్య, రాంబాబు, మరో ఇద్దరు ఉన్నారు. మిగతా విద్యార్థుల కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మురంగా కొనసాగుతోంది. దీనిపై అక్కడి మండి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, విద్యార్థుల కోసం పూర్తి స్థాయి గాలింపు కొనసాగుతోందని తెలిపారు.