: నాయినిని నిలదీసిన విద్యార్థుల తల్లిదండ్రులు


హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ప్రమాదంలో హైదరాబాదుకు చెందిన విద్యార్థులు గల్లంతైన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. టీ.హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఘటనా స్థలానికి బయలుదేరారు. అయితే, శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఊహించని ఘటన ఎదురైంది. ఘటనా స్థలానికి బయలుదేరిన విద్యార్థుల తల్లిదండ్రులు నాయినికి ఊపిరాడనంత పని చేశారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ప్రభుత్వం కూడా సరైన రీతిలో స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యం ఘటనా స్థలానికి తల్లిదండ్రులను తీసుకెళతామని చెప్పడంతో... వారంతా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే, విమానాశ్రయంలో తమనెవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి నాయిని ఢిల్లీకి బయల్దేరారు.

  • Loading...

More Telugu News