: పవన్, బాలకృష్ణలకు అభినందనలు తెలిపిన చంద్రబాబు
తన వల్ల ఓట్లు చీలకూడదనే భావంతో... కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలనే తపనతో ఎంతో శ్రమించిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఈ సందర్భంగా పవన్ వ్యక్తిత్వాన్ని చంద్రబాబు ఆకాశానికెత్తేశారు. అంతేకాకుండా, తన బావమరిది బాలకృష్ణకు కూడా బాబు అభినందనలు తెలియజేశారు. వీరితో పాటు రక్తచరిత్ర (పరిటాల రవి జీవిత చరిత్ర) సినిమాలో నటించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కు కూడా బాబు అభినందనలు తెలిపారు.