: ముఖ్యమంత్రిగా ఐదు సంతకాలు చేసిన చంద్రబాబు


ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చామని... వాటిని నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఐదు ఫైళ్లపై సంతకాలు చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తొలి సంతకాన్ని రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు, చేనేత రుణ మాఫీ ఫైలుపై చంద్రబాబు పెట్టారు. రెండో సంతకాన్ని... వృద్ధులు, వితంతువులకు రూ. 1000 పింఛను, వికలాంగులకు రూ. 1500 ఫింఛను ఫైలుపై చేశారు. అన్ని గ్రామాలకు తాగునీరు అందించే 'ఎన్టీఆర్ సుజల స్రవంతి' పథకం ఫైలుపై మూడో సంతకాన్ని పెట్టారు. నాలుగో సంతకాన్ని బెల్టు షాపుల రద్దు ఫైలుపై చేశారు. ఐదో సంతకాన్ని ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచుతూ చేశారు.

  • Loading...

More Telugu News