: చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది: వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో దూసుకుపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు వారు పోటీతత్వం కలవారని... అన్ని రంగాల్లో దూసుకుపోతారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు పొడవైన సాగరతీరం, జాతీయ రహదారులు ఉన్నాయని... ఇది అదనపు బలం అని తెలిపారు. భారతదేశంలో గొప్ప పారిశ్రామిక వేత్తలు, నిర్మాణ, ఐటీ రంగ నిపుణులు తెలుగువారే అని చెప్పారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని తెలిపారు. కేంద్రం నుంచి ఎన్ని రకాలైన సహాయ సహకారాలు అందాలో... అవన్నీ అందుతాయని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు చెప్పారు. దీనికి ఉదాహరణ తొలి కేబినెట్ సమావేశంలోనే పోలవరం ఆర్డినెన్స్ రావడమని తెలిపారు.