: ఎన్టీఆర్ నుంచి బాబు వరకు మా మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయి: ప్రకాశ్ సింగ్ బాదల్
ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు తమ మధ్య అనుబంధంలో ఏమాత్రం తేడా లేదని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ తెలిపారు. వేదికపై ఆయన మాట్లాడుతూ, బాబు కార్యదక్షత తనకు తెలుసని అన్నారు. బాబు మార్గనిర్దేశంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బాబుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.