: ఐపీఎల్ లో నేడు 'రాజస్థాన్-నైట్ రైడర్స్' పోరు
ఐపీఎల్ ఆరవ సీజన్ క్రికెట్ అభిమానులకు వేసవి తాపాన్ని తీరుస్తోంది. ఎండలు మండుతున్నా ప్రేక్షకులు మాత్రం ప్రీమియర్ లీగ్ ను ఏమాత్రం మిస్సవడం లేదు. కాగా, ఈ రోజు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ను ఢిల్లీతో ఆడిన రెండు జట్లూ శుభారంభం చేశాయి. మరిప్పుడు రెండో మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్నది ఆస్తక్తికరంగా మారింది.
ఇదిలా ఉంచితే, నిన్నరాత్రి హైదరాబాద్ సన్ రైజర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన పోరు అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించింది. వేసవికాలం అసలు వినోదాన్ని పంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ 46, హెన్రిక్స్ 44 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ అసలు పోరు 103/6 స్కోరు అనంతరం మొదలైంది. 18 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి వున్నప్పుడు బ్యాట్స్ మెన్లందరూ పెవిలియన్ బాట పట్టారు. అయినా అప్పటికే క్రీజులో ఉన్న విహారి, ఆశిష్ రెడ్డి చివరి పోరాటాన్ని మొదలుపెట్టారు.
అలా, ఒక సిక్స్, మరో బౌండరీతో ఇద్దరూ స్కోర్ బోర్డును కదిలించారు. ఇంకా ఆరు బంతులుండగా వినయ్ బౌలింగ్ లో ఆశిష్ వికెట్ పోయింది. వెనువెంటనే స్టెయిన్ క్రీజులోకి దిగాడు. చివరికి ఒక బాల్ ఉంది.. కావలసింది రెండు పరుగులు. ఈ సమయంలో వేసిన బంతి బ్యాట్ ను తాకలేదు. కానీ స్టెయిన్ పరుగుతీశాడు. అటు కీపర్ కష్టపడి బాల్ ను వికెట్లకు విసిరినా తాకలేదు, ఈలోపు పరుగు ముగిసింది. మ్యాచ్ టై అయింది. అలా 20 ఓవర్లలో రైజర్స్ కూడా 130 పరుగులు చేశారు. 7 వికెట్ల నష్టం, ఒక్క వికెట్ తేడాతో రాయల్స్ పై రైజర్స్ సంచలన విజయాన్ని సాధించారు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా విహారి నిలిచాడు.