: పసుపు రంగు పూసుకున్న గన్నవరం, బెజవాడ, గుంటూరు


గన్నవరం, విజయవాడ, గుంటూరు నగరాలు పసుపు రంగు పూసుకున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచీ టీడీపీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో బెజవాడ, గుంటూరు పట్టణాలు పసుపు వర్ణమైపోగా, వీఐపీలు, వీవీఐపీల రాకతో సందడిగా మారిన గన్నవరం విమానాశ్రయం భారీ కటౌట్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలతో నిమ్మపండు రంగులోకి మారింది. గన్నవరం నుంచి గుంటూరు దగ్గర ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతి కూడా పసుపు రంగులో కనువిందు చేసింది.

  • Loading...

More Telugu News