: సభా స్థలికి చేరుకుంటున్న వ్యాపార, సినీ, రాజకీయ ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేయనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి వ్యాపార, సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వివిధ మార్గాల్లో వీరంతా ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. కాసేపట్లో ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభం కానుండడంతో వేదిక వద్ద ఉత్సవ కోలాహలం నెలకొంది.