: వీఐపీ గ్యాలరీ ప్రవేశాల నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్ద వీఐపీ గ్యాలరీ ప్రవేశాలను నిలిపేశారు. వీఐపీ గ్యాలరీలు పూర్తిగా నిండిపోవడంతో వీఐపీ గ్యాలరీలోకి ప్రవేశాన్ని నిలిపివేశారు. కాగా తమ అభిమాన నేతలను సందర్శించేందుకు కార్యకర్తలు వీఐపీ గ్యాలరీ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని నిలువరించేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు.