: ఏపీ సీఎం సంతకం కోసం సిద్ధమైన బెల్టు షాపుల ఫైలు
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు మూడు ఫైళ్లపై సంతకం చేయనున్నారు. వాటిలో ఒకటి బెల్టు షాపుల నిర్మూలన. దీంతో, సీఎం సంతకం కోసం బెల్టు షాపులకు సంబంధించిన ఫైలును ఏపీ ఎక్సైజ్ అధికారులు సిద్ధం చేశారు. అంతే కాకుండా, బెల్టు షాపులకు మద్యం సరఫరా చేయరాదంటూ వైన్ షాపులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు.