: మూతపడ్డ 'ఢిల్లీ పబ్లిక్ స్కూల్'
హైదరాబాద్ శంషాబాదులోని ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. దీంతో పాఠశాల యాజమాన్యం తాత్కాలికంగా స్కూలును మూసివేసింది. ఈ పాఠశాల యాజమాన్యం కొన్ని నెలలుగా ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించకపోవడంతో వారు నిరసనకు దిగారు. స్కూలు మూతపడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు..తమ బిడ్డల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. పాఠశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.