: యువతలో జీవనశైలి మార్పులతో పలురుగ్మతలు


యువతరంలో హైపర్‌టెన్షన్‌ కేసులు గణనీయంగా పెరుగుతూ ఉండడానికి మారుతున్న వారి జీవన శైలులు ప్రధాన కారణం అని.. డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. సైలెంట్‌ కిల్లర్‌గా భావించే ఈ హైపర్‌టెన్షన్‌నే ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి థీంగా ఎంచుకున్నారు.

వైద్యులు చెబుతున్న ప్రకారం 20`30 ఏళ్ల మధ్య వయస్సున్న కుర్రాళ్లలో ఈ హైపర్‌టెన్షన్‌ పెరుగుదల మరీ ఎక్కువగా ఉంటోంది. ఘోరం ఏంటంటే.. తమలో కనిపించే అధిక రక్తపోటు సమస్యను గురించి వారిలో చాలామందికి కనీస స్పృహ ఉండడం లేదు.

గతంలో వయస్సు ఎక్కువైన వాళ్లలో ఈ సమస్య సాధారణంగా ఉండేది. అయితే ఒత్తిళ్లు ఎక్కువ కావడం, మారుతున్న ఆహార అలవాట్లతో యువకులు కూడా ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి రుగ్మతలు క్రమంగా గుండెజబ్బులకు దారితీసి ప్రాణాంతకమయ్యే ప్రమాదం కూడా ఉన్నదని గుర్‌గావ్‌లోని కార్డియాలజిస్టు డాక్టర్‌ హేమలతా తివారి చెబుతున్నారు.

  • Loading...

More Telugu News