: మొత్తం రుణమాఫీ చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు: నాయిని
రైతుల మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని తామెన్నడూ చెప్పలేదని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. లక్ష వరకు రుణాలను మాఫీ చేస్తామని... రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తెలంగాణలో రౌడీయిజం, గూండాయిజం లేకుండా చేస్తామని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడతామని చెప్పారు. మావోయిస్టుల ఆశయాల కోసం తాము పాటుపడతామని... అందువల్ల, మావోయిస్టులు పోరాట మార్గాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపు ఇచ్చారు.