: అత్యాచారం కావాలని చేయరు: ఛత్తీస్ గఢ్ హోంమంత్రి


అత్యాచారాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తరుణంలో... నేతలు పిచ్చి వ్యాఖ్యలతో వివాదాలు కొనితెచ్చుకుంటున్నారు. అత్యాచారాలు ఉద్దేశపూర్వకంగా చేసేవి కావని, పొరపాటుగా జరిగేవంటూ ఛత్తీస్ గఢ్ హోంమంత్రి రామ్ సేవక్ పైక్రా తాజాగా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు రేపిస్టులను వెనుకేసుకొచ్చేలా ఉండడం గమనార్హం. ఇటీవల జరిగిన అత్యాచార సంఘటనలపై (ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ తదితర) విలేకరులు మంత్రి స్పందన అడగ్గా... పై విధంగా స్పందించారు. అత్యాచార ఘటనలపై ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News