: జగన్ తన పద్ధతి మార్చుకోవాలి: లోకేష్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై టీడీపీ యువనేత నారా లోకేష్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించక ముందే జగన్ విమర్శలు చేయడం ప్రారంభించారని అన్నారు. జగన్ తన పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. ప్రజల కోసం, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ శాయశక్తులా కృషి చేస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనప్పుడు విమర్శిస్తే బాగుంటుందని జగన్ కు లోకేష్ హితవు పలికారు. కనీసం ఒక నెల రోజులయినా జగన్ ఓపిక పట్టాలని సూచించారు.