: ముంబైలో కూతపెట్టిన మెట్రో రైలు


భారత ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ఉదయం మెట్రో సర్వీసును మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించారు. వెర్సోవా నుంచి ఘట్కోపర్ వెళ్లే రైలును చవాన్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మెట్రో రైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మితమైన తొలి మెట్రో రైలు సర్వీసు ఇది. 2007లో ప్రారంభమైన ఈ మెట్రో సర్వీసుకు రూ. 4,300 కోట్లు ఖర్చయ్యాయి.

  • Loading...

More Telugu News