: సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
బిర్యానీకి పేరొందిన సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి. అగ్నిమాపక శకటాలు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అగ్నిప్రమాదం కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది.