: గర్భాశయం లేని మహిళలకు శుభవార్త
మాతృత్వ భాగ్యం దక్కినప్పుడు మాత్రమే స్త్రీ జన్మకు సార్థకత అనుకునే భావజాలంతో మన సమాజంలో ఇప్పటికీ చాలా మంది ఉంటుంటారు. అలాంటి వారిలో ఏ ఒక్కరికైనా గర్భాశయమే లేకుండా ఉన్నట్లయితే.. ఇక ఆత్మన్యూనతతో కునారిల్లిపోతారు. ఇలాంటి వారికి కృత్రిమంగా గర్భాశయం అమర్చుకోవడం అనేది ఒక తీయటి కబురు అయితే.. ఆ గర్భాశయం ద్వారా బిడ్డకు జన్మనివ్వడం గనుక సాధ్యమైతే అది అద్భుతమైన వార్త.
ప్రస్తుతం అదే ప్రయోగం లండన్లో జరుగుతోంది. టర్కీకి చెందిన డెర్యా సెర్ట్ .. ప్రపంచంలో గర్భాశయం కృత్రిమంగా అమర్చుకున్న తొలి మహిళగా రికార్డుల్లో ఉంది. పుట్టుకతో గర్భాశయం లేని ఈ 22ఏళ్ల మహిళలకు 2011లో దాన్ని అమర్చారు. ఇటీవల ఆమె భర్తనుంచి సేకరించిన వీర్యంతో ఫలదీకరించిన పిండాన్ని ఆమె గర్భాశయంలో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం సఫలవంతమై బిడ్డ రూపుదాల్చిందా? లేదా? అనేది కొన్ని వారాల్లో తేలుతుంది. ఇది విజయవంతం అయితే.. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయం లేని ఎందరో మహిళలకు ఇది అద్భుతవార్త అని వారంటున్నారు.