: రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు
కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్రలో పలు చోట్ల, తెలంగాణలో ఒకటి రెండు చోట్ల వర్షాలు పడతాయని వెల్లడించింది. మరో 48 గంటల్లో కర్ణాటక రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు తెలిపింది.