: కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన రైతులు


ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గుండంపల్లి, మొగిలిపేటలో రైతులు ఈరోజు ఆందోళన నిర్వహించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణాలన్నింటినీ మాఫీ చేయాలని కోరారు. కేవలం 2013-14 సంవత్సరంలో తీసుకున్న వ్యవసాయ రుణాలను అదీ లక్ష రూపాయల వరకే మాఫీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని వమ్ము చేశారని రైతులు ఆరోపిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

  • Loading...

More Telugu News